ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఈ వాగ్దానాలు నిజమైన ఆరాధకుడికి చేయబడినవి (కీర్తనను చూడండి 84. ఈ ఆరాధకుడు తాను ఉండలేనప్పటికీ కూడా దేవుని సమక్షంలో ఉండి, ఆరాధనలో దేవునితో ఉండాలి అని అనుకుంటున్నాడు.ఈ ఆరాధికుడు తన యొక్క బలము, విజయము, ఆనందము మరియు నిరీక్షణకు మూలము దేవుడే అని పూర్తిగా విశ్వసిస్తున్నాడు. ఈ ఆరాధికునికొరకే దేవుడు ఎన్నో సాటిలేని వాగ్దానాలను విడిచిపెట్టాడు. రోమా 8 వ అధ్యాయము మరియు దానిలోని హాల్ మార్కువంటి 28 వ వచనంలో వలే దేవుడు "తాను ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, " క్రీస్తు నందు" మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుటకు( రోమా:32) పనిచేయుచున్నాడని వాగ్దానుమును ఇచ్చుచున్నాడు. ఎందుకు? ఎందుకనగా దేవుడు మనకు తోడు,అతను మన సూర్యుడు మరియు కవచం. అతను తన దయను మరియు కృపను కుమ్మరిస్తున్నాడు మరియు అయన మేలైనది ఏదియు మననుండి దూరముచేయడు.
నా ప్రార్థన
ప్రియమైన తండ్రీ, నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను? నీవు నాకు కృపను యేసునందు ప్రసాదించావు. మీరు నాకు విజయం మరియు స్వర్గమును వాగ్దానం చేసారు. నీ కృపకు నేను నిన్ను స్తుతిస్తాను. మీ మహిమను నాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నారని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు, ప్రియమైన తండ్రీ, నీవు నేను ఉండాలని కోరుకుంటున్న నమ్మకమైన వ్యక్తిగా ఉండటానికి పరిశుద్ధాత్మ ద్వారా నాకు సహాయముచేయండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.