ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
దయచేసి గమనించండి: మేము ఒక దశాబ్దం క్రితం ఈ వాక్యం భాగాన్ని ఎంచుకున్నాము. ఈ సంవత్సరం ప్రతి సూచన దాని తేదీకి అనుగుణంగా ఉంటుంది - 8/14/2024 హొషేయ 8:14గా మారింది. ఈ పద్ధతి మనం తరచుగా విస్మరించే వాక్యభాగము వినడానికి మనల్ని సవాలు చేస్తుంది మరియు దేవుని బోధనకు అనుగుణంగా మన జీవితాలను మరియు ప్రాధాన్యతలను సర్దుబాటు చేసుకోమని పిలుస్తుంది. శ్రేయస్సుకలిగినప్పుడు , దేవుని ప్రజలు ప్రభువును విడిచిపెట్టారు. వారు తమ చుట్టూ ఉన్న సాంస్కృతిక దేవతలను అనుసరించారు మరియు ఆ ప్రపంచంలోని అనైతికతలో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలు అని పిలువబడే ఉత్తర తెగలు, వారి చుట్టూ ఉన్న వారిలాగే లౌకిక మరియు అన్యమతంగా మారాయి. వారు అనైతిక జీవితాలను గడిపారు, పేదలను పట్టించుకోవడం మర్చిపోయారు, వారిలోని విదేశీయులను పట్టించుకోలేదు, వితంతువులను మోసం చేశారు, తండ్రిలేని వారితో దుర్మార్గంగా ప్రవర్తించారు (ఆమోసు 5:9-15). దేవుని ప్రవక్తలు, ఆమోసు మరియు హోషేయలు ఈ దుర్మార్గాలను ఖండించారు. దేవుడు వారి పాపాలను చూసి తెలుసుకున్నాడు. సర్వధికారము కలిగిన ప్రభువు ఇశ్రాయేలు యొక్క ఉత్తర తెగలు తమ రాబోయే నాశనానికి కారణమైనట్లు గుర్తించాలని కోరుకున్నాడు. వారి కఠిన హృదయాలు మరియు దేవుని స్వరూపంతో జీవించడానికి పదే పదే నిరాకరించడం (ద్వితీయోపదేశకాండము 10:14-22) వారి నిర్మూలనకు దారితీసింది. క్రైస్తవులుగా, దేవుడు ఎన్నుకున్న ప్రజలలో మరియు అతని పవిత్ర యాజకత్వంలో భాగమైన (1 పేతురు 2:9-12), మనం ఇశ్రాయేలు చరిత్ర యొక్క హెచ్చరికను తప్పక గమనించాలి. మన జీవితాలు అతని విలువలను చిత్రించాలి, మన హృదయాలు అతని కరుణను ప్రదర్శించాలి మరియు మన చేతులు ఆయన చిత్తాన్ని చేయాలి, లేదా మన వాదనలు అర్థరహితమైనవి మరియు మన భవిష్యత్తు దుర్భరమైనదిగా ఉండును.మనం ప్రభువును వెతకాలి మరియు జీవించాలి, దేవుని హృదయాన్ని విస్మరించే నకిలీ-మతపరమైన ఆచారాల యొక్క అన్ని తప్పుడు ఆధారాలను కాదు (ఆమోసు 5:1-27).
నా ప్రార్థన
తండ్రీ, మమ్మల్ని క్షమించు, ఎందుకంటే పాపం చేసాము. తండ్రీ, నన్ను క్షమించు, పాపం చేసినందుకు మరియు సామాజిక, న్యాయ, మరియు జాతి అన్యాయాలను చూసాము . యెహోవా, ప్రియమైన యెహోవా, మాకు శక్తినివ్వండి, నిజంగా మీ పవిత్ర దేశంగా ఉండటానికి, మా జాతి, వయస్సు, జాతీయత, రాజకీయ ప్రాధాన్యతలు లేదా సామాజిక ఆర్ధిక స్థితి అధారముగాకాక యేసుపై మన విశ్వాసంతో కట్టుబడి మీ కీర్తి మరియు ప్రశంసల ద్వారా మా స్తుతులతో అనుసంధానించబడి ఉండి మిమ్మును మా తండ్రిగా కలిగియుండుట ద్వారా వచ్చు కరుణను మాదిరిగా కనపరుస్తూ ఉండునట్లు చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.