ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనకు ఇవ్వనిది అంటూ ఏముంది ? ఏమీ లేదు. ఇవి దేవుని ఉదారమైన దయ, ఊహించని ఆశీర్వాదం, క్రమశిక్షణ కష్టాలు, దేవుని చిత్తము లేదా మన మంచి ఆరోగ్యం ద్వారా వచ్చినవే . మరియు మనము తీర్పు సింహాసనం ఎదుట నిలబడి ఉన్నప్పుడు, కృప ద్వారా మనం పొందుకునేవి ఏమిటి? యేసు ద్వారా మనకు దేవుని ఉదారమైన మరియు ప్రేమపూర్వక బహుమతులు మాత్రమే. ఈ దయ మనల్ని పవిత్రంగా, స్వచ్ఛముగా ,సంపూర్ణంగా చేసింది! మనము కలిగి ఉన్న, సాధించే లేదా కొనుగోలు చేసే ఏదీ మనకు అలాంటి హక్కును ఇవ్వదు. దేవుని దాతృత్వం, దయ, కరుణ మరియు ప్రేమ మాత్రమే మనకు పరలోకం యొక్క గొప్ప బహుమతులను అందిస్తాయి. అంతా కూడా ప్రసిద్ధ డాక్సాలజీ అనే గ్రీకు పదము మనలను "సమస్త దీవెనలుదేవుని వద్దనుండి ప్రవహించే కాబట్టి దేవుణ్ణి స్తుతించండి!" అనే విధముగా పాడటానికి పురికొల్పినట్లుగా ఉంటుంది.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, మీ అద్భుతమైన మరియు అత్యధిక ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. నా దగ్గర ఉన్నవన్నీ, నేను కలిగి ఉన్నవన్నీ, మరియు నేను ఎప్పటినుంచో ఆశిస్తున్నదంతా ఇప్పుడు ఉనికిలో వున్నవి అంటే అది మీరు నాపై చూపిన దయ మరియు కృప వల్ల మాత్రమే. ధన్యవాదాలు, యేసు నామంలో. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు