ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
క్రైస్తవులుగా, మనం క్షమాపణ మరియు దయతో కూడిన దేవుని వాతావరణంలో జీవించాలి. మనం ఇతరులను క్షమించినప్పుడు, ఆ క్షమాపణకు ఆధారం దేవుడు ఇప్పటికే మనల్ని క్షమించిన అపురూపమైన రుణం (ఎఫెసీయులకు 4:32-5:1; మత్తయి 6:14-15, 18:21-35). దేవుడు తన క్షమాపణ చెలామణిలో ఉంచాలని మరియు మన ద్వారా ఇతరులకు అందజేయాలని కోరుకుంటున్నాడు. మనం ఇతరులను క్షమించినప్పుడు దేవుడు మనలో మరింత క్షమాపణ మరియు ప్రేమను ఆనందంగా కురిపిస్తాడు (రోమా 5:5). మనకు హాని చేసి గాయపరిచిన వ్యక్తిని క్షమించడం ఎంత కష్టమో, దానికొరకు మనం చేసిన ఖర్చు కంటే మనం పొందే ఆశీర్వాదాలు చాలా ఎక్కువ అని మనం తెలుసుకోవాలని యేసు కోరుకుంటున్నాడు!
నా ప్రార్థన
ప్రేమగల మరియు న్యాయమైన దేవా, మీ కుమారుడైన యేసు చేసిన ప్రాయశ్చిత్త బలి ద్వారా నన్ను శుభ్రపరిచి క్షమించినందుకు ధన్యవాదాలు. మీరు నన్ను క్షమించినట్లు ఇతరులను క్షమించమని నన్ను సవాలు చేసినందుకు ధన్యవాదాలు. మీ ప్రజలు క్షమించే సమాజంగా ఉండాలని కోరినందుకు ధన్యవాదాలు. క్షమించటం పట్ల మనకు అయిష్టత, నెమ్మదిగా వుండటము లేదా అనుమానం వచ్చిన ఆ పరిస్థితిలో మమ్మల్ని క్షమించండి మరియు ముఖ్యంగా నన్ను క్షమించు. ____(వారుచేసి తప్పు ) కోసం మీరు ___ (పేరు)ను క్షమించమని నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను మరియు ఈ వ్యక్తిని మీ ప్రేమ మరియు దయతో ఆశీర్వదించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యేసు నామంలో. ఆమెన్.