ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు తన మొదటి శిష్యులకు నేర్పించిన సాధారణ సత్యాన్ని నేను ప్రేమిస్తున్నాను.మీరు యేసు కుటుంబంలో ఒక భాగంగా గుర్తించబడాలనుకుంటున్నారా ? అయితే తన తండ్రి మాటను పాటించి తన తండ్రి చిత్తప్రకారం జీవించండి !అప్పుడు యేసు మిమ్మిను తన కుటుంబంలొ ఒకని చేసుకొని అనుసరించడానికి అనేకులకు నిన్ను మాదిరిగా ఎత్తి పట్టుకొనును.

నా ప్రార్థన

ప్రియమైన పరలోక తండ్రి ఈ రోజు నన్ను ఆశీర్వదించండి, దయచేసి, . నేను స్పష్టతతో జీవించాలనుకుంటున్నాను మరియు విధేయతతో మిమ్మల్ని అనుసరించడానికి మరియు మీ ఇష్టాన్ని గౌరవించడానికి నా జీవితంలో మీరు ఉంచిన అవకాశాలను చూడాలనుకుంటున్నాను. అయితే, ప్రియమైన తండ్రీ, ఈ స్పష్టత క్షణికమైన విషయంగా ఉండకూడదనుకుంటున్నాను. నేను మీ కుటుంబంలో శాశ్వతంగా మరియు ఎప్పటికి భాగం కావాలని కోరుకుంటున్నట్లే, నా జీవితంలో స్థిరంగా మీకు కట్టుబడి, గౌరవించాలనుకుంటున్నాను. అలా చేయడానికి నా రోజువారీ మార్గంలో మీరు ఉంచే అవకాశాల గురించి మరింత తెలుసుకోవడంలో నాకు సహాయపడండి! యేసు నామంలో, నేను ఇలా అడుగుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు