ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మీ ప్రాముఖ్యత యొక్క మూలం ఏమిటి? ఈ సామెత ప్రపంచాన్ని మిగిలిన సంస్కృతికి తలక్రిందులుగా చూడటానికి సవాలు చేస్తుంది. అణకువ మరియు అణగారిన వారితో వినయం మరియు సహవాసం దేవునికి విలువైనవి. దూషించుట మరియు అహంకారం దేవునికి విలువైనవి కావు . దేవుడు మనకు ఈ సామెతను ఇవ్వటమే మాత్రమే కాదుగాని దానిని ప్రదర్శించడానికి ఆయన తన కుమారుడిని మనకు పంపించాడు. ఇప్పుడు మనం దానిని జీవించడం మాత్రమే నేర్చుకోగలిగితే. ఆహ! కానీ యేసు, “నన్ను అనుసరించండి!” అని చెప్పినప్పుడు దానిని ప్రదర్శించే అవకాశాన్ని మనకు ఇస్తున్నాడు . (యోహాను 13ను కూడా చూడండి. )
నా ప్రార్థన
తండ్రీ, శోధనల విషయంలో మరియు,నా సంస్కృతి ముఖభాగాల ఎరకు మరియు "జనాదరణ పొందిన జనసమూహం" లాగా ఉండేలనే ఒత్తిడికి లోబడు నా బలహీనత మరియు దుర్బలత్వాన్ని నేను గుర్తించాను. అధికారం కలిగికూడా వినయాన్ని ప్రదర్శించిన, వదిలివేసిన, మరచిపోయిన మరియు తిరస్కరించబడిన వ్యక్తులతో గుర్తింపు పొందిన యేసు కోసం ధన్యవాదాలు. వదిలివేయబడిన , మరచిపోయిన మరియు అర్హత లేని వారిని నాతో చేర్చడం ద్వారా నా ప్రపంచంలో వ్యత్యాసాన్ని సృష్టించడానికి దయచేసి నన్ను ఉపయోగించండి. యేసు నామము లో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.