ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్నిసార్లు, మన ప్రార్థనలు బాస్కెట్ బాల్ వలె ఎలా కొడతామో అలాగే పైకప్పు నుండి తిరిగి నెలమీద పడుతున్నట్లు ఉండి , మన పాదాల క్రింద గిలగిల కొట్టడం మరియు మన అభ్యర్థనలను అపహాస్యం చేస్తూ మనలను జారవిడచడం వంటివి కనిపిస్తాయి. కొన్ని సమయాల్లో, మనము భావోద్వేగానికి లోనవుతాము మరియు మన ప్రార్థనలోని పదాలు మన హృదయాలలో వున్న సంగతులను కనీసం గుర్తించలేవు. మన ప్రార్థనల శక్తి మన పదాల ఎంపికపై ఆధారపడి ఉండదు, కానీ పరిశుద్ధాత్మ మధ్యవర్తిత్వం ద్వారా మనకు ఇచ్చిన ఆయన దయపై ఆధారపడి ఉంటుందని హామీ ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు. పరిశుద్ధాత్మ మన అభ్యర్థనలను - మన పదాలు, మన భావోద్వేగాలు మరియు మన పదాలు మరియు భావోద్వేగాలకు మించిన విషయాలను కూడా దేవునికి అందజేస్తాడు మరియు మన హృదయాలు మరియు నోటి నుండి ఏది బయటకు వచ్చినప్పటికీ, అతను దానిని శక్తివంతంగా మరియు ఆమోదయోగ్యంగా దేవునికి చేరుస్తాడు!

నా ప్రార్థన

పరిశుద్ధ దేవుడవు మరియు ప్రియమైన తండ్రీ, నాకు పరిశుద్ధాత్మ బహుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు, వీరి ద్వారా నేను ప్రార్థించేటప్పుడు నా మాటలు, నా ఆలోచనలు మరియు నా హృదయాన్ని మీరు వింటారని నాకు అత్యున్నత హామీ ఉంది. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు