ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మనం క్రైస్తవులుగా మారినప్పుడు, మనము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే పరిశుద్ధపరచబడలేదు, పరిశుద్ధాత్మతో కూడా నింపబడ్డాము. యోహాను దీనిని మన అభిషేకంగా మాట్లాడుతాడు. యేసు గురించిన సత్యాన్ని వినడానికి ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు మరియు ఆ సత్యాన్ని తప్పుడు బోధనలకు అప్పగించకుండా ఆవరించబడి అది యేసు గుర్తింపుకు ఇరువైపులా అనగా యేసు, మనతో దేవుడు మరియు మనలాంటి దేవుడు అని బయలుపరుస్తుంది . ఈ నమ్మశక్యం కాని సత్యాలు రెండింటినీ పట్టుకున్నప్పుడు మనము యేసులో ఉంటాము.
నా ప్రార్థన
పవిత్ర మరియు న్యాయమైన తండ్రీ, నన్ను రక్షించడానికి యేసును పంపినందుకు ధన్యవాదాలు. నేను నా అద్భుత భావాన్ని లేదా యేసులో ఉన్న, మరియు ఉండబోయే ప్రతిదానికీ నా ప్రశంస అనుభూతిని ఎన్నటికీ లోపరచను . మీ కుమారుడు మరియు నా రక్షకుని గురించిన సత్యాన్ని కాపాడటానికి నాకు సహాయపడటానికి మీ ఆత్మను నాకు పంపినందుకు ధన్యవాదాలు, నేను యేసు నామములో ప్రార్థిస్తాను మరియు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆమెన్.