ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను నమ్ముతున్నాను మరియు ఆయన నా జీవితానికి ప్రభువుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను." అనేది మనలో ఎవరైనా చేసే మధురమైన ఒప్పుకోలు. తండ్రి అయిన దేవుని మహిమ కోసం బిగ్గరగా ఈ మాటను చెప్పుదాము.ఇతర వ్యక్తులు యేసు గురించి ఏమి చెబుతారు మరియు వారు యేసు గురించి ఏమి విశ్వసిస్తారు అనేది పేతురుకు ప్రభువు ప్రశ్న యొక్క దృష్టి కాదు. నేను యేసు ఎవరు అని చెప్పగలను అనేదే ప్రశ్న ? పేతురు లాగా జవాబిస్తావా? మనం తప్పక అలాగే జవాబు ఇవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి, మూడవసారి మళ్ళీఅలాగే చెప్పుకుందాం: "యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను నమ్ముతున్నాను మరియు అతను నా జీవితానికి ప్రభువుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను." ఇప్పుడు, సంవత్సరం ముగిసేలోపుగా ,ఈ మాటను వారి జీవితములో మొదటిసారిగా చెప్పేవారిని ఆహ్వానిద్దాము.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన యెహోవా, మీ మెస్సీయ యేసును నా కొరకు తీసుకువచ్చు ప్రణాళికను కలిగి ఉన్నందుకు ధన్యవాదాలు. ప్రియమైన దేవా, అతను మీ కుమారుడని నేను నమ్ముతున్నాను, ఈ రోజు, మరియు నా మిగిలిన రోజులు ఆయన నా ప్రభువు కావాలని నేను కోరుకుంటున్నాను. మీ కుమారుడు మరియు నా రక్షకుడైన యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు