ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము మన ప్రభువు మరియు రక్షకునిగా యేసు గురించి తరచుగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన స్వరాన్ని విస్మరించడం లేదా అధ్వాన్నంగా, యేసు మాటలను విని వాటిని విస్మరించడాన్ని కూడా మనం సులభముగానే కనుగొనవచ్చు. యేసు చెప్పినదానికి మనం విధేయత చూపడం మనం ఆయనపై విశ్వాసం కలిగియున్నామని చూపిస్తుంది. తెలివితక్కువగా అవిధేయత చూపడం, విస్మరించడం లేదా యేసు చెప్పినదానిని నిర్లక్ష్యం చేయడం అంటే, ఆయన మన ప్రభువుగా మనతో చెప్పినట్లు చేయడం మనం ఆయనను మన ప్రభువు అని నమ్మడం లేదని చూపించడమే! ఈ దృక్పథాన్ని స్వీకరించేవారికి తీర్పు చాలా కఠినముగా ఉంటుంది అని యేసు వాగ్దానం చేశాడు (మత్తయి 7:21-27). కాబట్టి, సంవత్సరం ముగిసేలోపు ప్రతి నాలుగు సువార్తలను (మత్తయి మార్క్, లూకా, & యోహాను ) చదవడానికి కట్టుబడి ఉందాం. మనం యేసు జీవితం మరియు బోధల గురించి చదువుతున్నప్పుడు, యేసు హృదయాన్ని అన్వేషించడమే గాక, ఆయనను మరింత బాగా తెలుసుకునేందుకు మరియు మరింత క్షుణ్ణంగా మరియు మరింత విధేయతతో ఆయనను అనుసరించడానికి సహాయం చేయమని దేవుణ్ణి వేడుకుందాం ( 2 కొరింథీయులు 3:18)!

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, నాతో ఉండండి, నేను యేసును బాగా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను మరియు మీ పవిత్ర గ్రంథాలను చదివేటప్పుడు అతని మాటలను మరింత నమ్మకంగా పాటిస్తాను . ఆయన పేరు, యేసు, దేవుని కుమారుడు మరియు మనుష్యకుమారుడు, నేను అయన నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు