ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఐక్యత మరియు సామరస్యం అనేవి అనుకొనకుండా ప్రమాదవశాత్తు కలిగినవి కావు ! అవి ఉద్దేశం మరియు సమర్పణ కారణంగా జరుగుతాయి. కానీ కేవలం అలావుండుటకంటే, వారు దేవునిచే ఆజ్ఞాపించబడ్డారు. మనలో ఐక్యత మరియు సామరస్యం ఎలా ఉన్నాయి? మన "సంఘము " జీవనశైలిలో మనకు మూడు కట్టుబాట్లు ఉండాలని పేతురు గుర్తుచేస్తున్నాడు — 1) దుఃఖించే వారి బాధలను మరియు ఆందోళనలను చురుకుగా పంచుకోవాలి; 2) ఒక ఆరోగ్యకరమైన కుటుంబం ప్రతి సభ్యుని ప్రేమించి, విలువనిచ్చినట్లే ఒకరినొకరు ప్రేమించుకోండి; మరియు 3) మనల్ని బాధపెట్టే ఇతరుల వైఫల్యాలతో మనం వ్యవహరించేటప్పుడు మనము ప్రేమించవలసినవారిని బాధపెట్టే అవకాశం కూడా ఉందని గ్రహిస్తూ అహంకారానికి బదులు కనికరం చూపండి.
Thoughts on Today's Verse...
Unity and harmony are no accident! They happen because of intention and submission. But more than just states of being, they are commanded by God. How do we have unity and harmony? Peter reminds we must have three commitments in our "church" lifestyle — 1) actively share the sorrows and concerns of those who grieve; 2) love each other just like a healthy family loves and values each member; and 3) show compassion rather than arrogance as we deal with the failures of others that hurt us, recognizing that we are vulnerable to sinning and hurting those we love, too.
నా ప్రార్థన
తండ్రీ, క్రీస్తులోని నా సోదరులు మరియు సోదరీమణులు నేను అర్హురాలని భావించిన విధంగా నా యెడల ప్రవర్తించవలసిన విధముగా ప్రవర్తించనప్పుడు నేను నా స్వంత అతి సున్నితమైన స్వభావాన్ని గాయపరిచానని మరియు చిన్నతనంతో ప్రతిస్పందించానని నేను అంగీకరిస్తున్నాను. అతను సృష్టించిన వారిచే యేసు చాలా అసభ్యంగా మరియు అవమానకరంగా ప్రవర్తించబడ్డాడని నాకు తెలుసు విషయాలు ఎల్లప్పుడూ నాకు సరిగ్గా జరగనప్పుడు నేను ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ తండ్రీ, ప్రేమపూర్వక ఘర్షణతో నన్ను గాయపరిచిన వారిని ఎప్పుడు సవాలు చేయాలో మరియు వ్యంగకరమైన మాటలు విస్మరించి, వారి జీవితంలో లోతైన గాయం కారణంగా వారికి పరిచర్య చేసే మార్గాన్ని ఎప్పుడు కనుగొనాలో తెలుసుకోవడానికి దయచేసి నాకు సహాయం చేయండి. తండ్రీ, నన్ను మీ శాంతి, సామరస్యం, దయ మరియు ఐక్యతకు సాధనంగా ఉండనివ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
My Prayer...
Father, I confess that I have let my own over-sensitive self be wounded and have reacted with pettiness when my brothers and sisters in Christ have not treated me as I felt I deserved. I know Jesus was treated so rudely and shamefully by those he created and so I shouldn't be surprised when things don't always go well for me. But Father, please help me to know when to challenge those who wound me with a loving confrontation and when to just ignore the barb and find a way to minister to them because of some deeper wound has crippled them in their life. Father, let me be an instrument of your peace, harmony, grace, and unity. In Jesus' name I pray. Amen.