ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మనము బాప్తిస్మము లో యేసు నామమున ప్రార్ధించి , ఆయనను మన రక్షకుడిగా విశ్వసించినందున, మనము పాపము విషయములో చనిపోయాము. ఈ మరణంలో, యేసు మరియు దేవుని శక్తిపై మనము కలిగియున్న విశ్వాసం కారణంగా మనం మరణము విషయములో మరణిస్తాము మరియు మరణం నుండి జీవమునకు వెళ్తాము (యోహాను 5:24; కోలస్సి 2:12). మన జీవితము యేసుతో కలిసిపోయింది, మరియు అతని అద్భుతమైన భవిష్యత్తు మన సొంతమవుతుంది (కోలస్సి 3: 1-4). మనము ధర్మశాస్త్రము క్రింద లేము , కానీ కృపకు లోబడివున్నాము . కృప అనే ఈ బహుమతి పట్ల అభిరుచితో మరియు పవిత్రంగా ఉండాలనే ఆశతో ప్రతిస్పందిద్దాం. మనల్ని యేసువలే మార్చే పరిశుద్ధాత్మ పనికి మనల్ని మనం తెరుచుకుందాం (2 కొరిం. 3:18). మనము కృప వలన -పిల్లలము . మనము పాపానికి బానిసలుగా లేము, కానీ దేవుడు మనల్ని తయారు చేసినట్లుగా ఉండటానికి కృప ద్వారా విముక్తి పొందాము- మనము అతని చేతిపని (ఎఫెసీ . 2: 1-10). పాపం మన యజమాని కాదు!
నా ప్రార్థన
ప్రియమైన యెహోవా మరియు తండ్రీ, నా హృదయాన్ని శుద్ధి చేయండి మరియు మీ కృపకు కొత్తదిగా మరియు సజీవంగా మరియు ఒక్కసారి నేను చిక్కుకున్న పాపము విషయములో చనిపోయేలా చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.