ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
గడచిన కొన్ని సంవత్సరాలు విశ్వాసులకు కాలము అంత సులభముగా లేదు . ప్రపంచవ్యాప్తంగా హింస ఎప్పటికప్పుడు ఎక్కువగా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్లో, సామూహిక హంతకులు ప్రత్యేకంగా దేవుణ్ణి విశ్వసించే వారిని లక్ష్యంగా చేసుకొని హత్యలు చేస్తున్నారు . వారు విశ్వాసం కోసం ఉరితీయబడినప్పటికీ, యెహోవా కొరకు వారి సాక్ష్యం స్ఫూర్తిదాయకం. అటువంటి వాస్తవికతను మనము కూడా ఎదుర్కొన్నప్పుడు మనకు చాలా మాదిరులు ఉన్నాయి. బహుశా వారిలో ఏ విధమైన కుదుపు ఉండకపోయి ఉండవచ్చు. ఇది ఒకప్పటి భయానకమైన విషయమే.ఇది మనలను క్రైస్తవ సమాజం యొక్క ప్రారంభ రోజులకు తిరిగి తీసుకు వెళుతుంది. ఇది వాస్తవానికి యేసు జీవించిన రోజులకంటే ముందు కూడా సంభవించింది , మన యూదా వీరులు రెండు సాధారణ కారణాల వల్ల హింసించబడ్డారు అవి : వారు ఒకే నిజమైన దేవుణ్ణి విశ్వసించారు మరియు వారు కూడా యూదులై యుండుటవలన . ఈ గ్రంథం నుండి 5 వ కీర్తనలోని పురాతన ప్రార్థనను తిరిగి ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని నేను నమ్ముతున్నాను. మనము దానిని ప్రార్థించేటప్పుడు, ఇతరులు మనకు ఏమి చేసినా, వారు మనల్ని దేవుని నుండి మరియు ఆయన భవిష్యత్తులో మన కొరకు కలిగి ఉన్న విమోచన నుండి వేరు చేయలేరని గుర్తుంచుకోనివ్వండి.
నా ప్రార్థన
సర్వశక్తిమంతుడవైన దేవా, దయచేసి మన ప్రపంచాన్ని శాంతి కాలంతో ఆశీర్వదించండి. మనుష్యుల ద్వేషం ద్వారా సాతాను మీ పిల్లలపై వేధించిన భయానక పరిస్థితుల నుండి మాకు ఉపశమనం కలిగిస్తూ ఆశీర్వదించండి. మన విశ్వాసం విషయములో బహిరంగంగా ఉండటానికి, మన క్షమాపణతో ఉదారంగా, శాంతి లేదా హింసలో మరియు మన ఆశలో స్థిరంగా ఉండటానికి ధైర్యం ఇవ్వండి. చివరగా, తండ్రీ, దయచేసి మీపై విశ్వాసం ఉన్నందున ప్రియమైనవారు హతసాక్షులైన వారిని ఆశీర్వదించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.