ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
కృప అనేది చాలా చౌకగా మారిందని 50 సంవత్సరాల క్రితం డైట్రిచ్ బోన్హోఫర్ అనువారు చెప్పారు. ఈ రోజువున్న పరిస్థితిని బట్టి అతను ఏమి చెబుతారో అని నేను ఆశ్చర్యపోతున్నాను? నేను దయ కోసం ఉన్నాను, కానీ దానికైన ఖర్చుకు నేను భయపడ్డాను. నేను దానిని స్వీకరించినట్లు తరచుగా చెప్పుకోగలుగుతున్నప్పటకి నా జీవితాన్ని నేను అర్థం చేసుకోలేను, మరియు దానిని ఇచ్చిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వము తో నా జీవితానికి ఏ విధమైన పోలిక లేదు.సముయోలు ద్వారా చెప్పబడిన దేవుని వాక్యం కొంత కఠినమైనదిగా అనిపిస్తుంది . అయినప్పటికీ అది మన జయకేతన కృపాగీతములో చేర్చాలని నేను నమ్ముతున్నాను. మీరూ చూస్తారు, నిజమైన దయ మనలను మారుస్తుంది. ఇది మనలను దయామయులుగాను మరియు ఆ కృపనిచ్చిన క్రీస్తునివలే మారుస్తుంది . కాకపోతే, మనం దయని నపుంసకత్వము(చేతకాయనితనం), శక్తిలేనిదిగా మరియు అబద్ధం అని పిలుస్తాము. మనలో దేవుని నిజమైన శక్తిని నిరాకరించిన మతం యొక్క ఒక రూపముగా పౌలు దానిని పిలిచాడు (2 తిమోతి 3: 5). విధేయతను సద్గుణాలను సమాధులలోనుండి తిరిగి లేపి మన మత గతం యొక్క అటకపై నుండి రక్షించుకుందాం.
నా ప్రార్థన
తండ్రీ, మీరు నా పాపంతో నిరాశ చెందారని నాకు తెలుసు, అయినప్పటికీ మీ దయ ఇంకా ప్రవహిస్తుంది మరియు దానిని కప్పివేస్తుంది. కానీ తండ్రీ, నేను ఆ దయ విషయములో సాహసము చేయాలనుకోవడములేదు . నా పాత్ర యొక్క లోతైన పోరాటాలు మరియు నేను "కాస్త" వదులుకోవాలనుకునే విషయాలు మీకు మరియు నాకు తెలుసు. దయచేసి పరిశుద్ధాత్మ ద్వారా నాలో మీ పరిపూర్ణతయను పనిని చేయనివ్వండి , నా రక్షకుడైన యేసులాగా ఉండటానికి నన్ను మరింతగా ధృవీకరించండి, యేసునామము ప్రార్థిస్తున్నాను ఆమెన్ .