ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ప్రతిఒక్కతో కలిసి ఉండాలని మరియు విషయాలు ప్రశాంతంగా ఉండాలని కోరుకునే ప్రజల జీవితాలలో సమాధానము అనునది పాదరసం, ఆవిరి కంటే ఎక్కువగా కనిపించకుండాపోయేది. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న సమాధానము ఏమనగా అది దేవునితో సమాధానము, అది ప్రశాంతముగా ఉండాలనే కోరిక మరియు ఏవిధమైన సంఘర్షణ లేకపోవడం కంటే చాలా లోతుగా ఉంటుంది. యేసు, దేవునికి తన త్యాగం విధేయత ద్వారా, దేవునితో సమాధానమను ఆలోచనను మనకు నిజం చేసాడు. అవును, దేవుడు దానిని దయతో అందించాడు. అవును, ఆ దయ వల్ల దేవుడు మనకు నిరీక్షణను కలుగచేసేవాడు. కానీ, ఈ సమాధానము అతనితో మరియు అతని వ్యక్తిత్వముతో ముడిపడి ఉన్నందున, మనము మన మహిమాన్వితమైన దేవుని మహిమలో చిక్కుకుపోతామని మనం సంతోషించవచ్చు మరియు ఊహించవచ్చు.
నా ప్రార్థన
అత్యంత ఘనత గల దేవా , యేసులో మీ దయ అను బహుమతి బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. నాకు విశ్వాసం మరియు నమ్మకాన్ని ఇవ్వండి, తద్వారా , భద్రంగా మరియు ధైర్యంగా, ఆశతో మరియు ఆనందంతో నిండిన జీవితంతో నేను మీ కోసం నిలబడి జీవించగలను . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.