ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
దేవుని భక్తితో ఆరాధించాలి ఎందుకంటే ఆయన దహించు అగ్ని ! దాని అర్థం ఏమిటి? ఇది అతని పవిత్రతపై దృష్టితో మాట్లాడుతుందా ? లేదా ఈ మాట తీర్పు గురించి హెచ్చరిస్తుందా? ఇది అతని స్వచ్ఛత యొక్క వ్యక్తీకరణనా? అవును అవును అవును! దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. అతని పరిపూర్ణతతో పోల్చితే మన లోపాలు, బలహీనతలు , వైఫల్యాలు మరియు పాపాలు స్పష్టంగా కనిపిస్తాయి. తన పవిత్ర అగ్నితో మనల్ని నాశనం చేయకుండా అతను మనలను నూతనంగా మరియు శుభ్రంగా చేయగలడు మరియు మనం ఒకప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగా ఉండగలము.కాబట్టి యేసు వల్ల మనం ఆయన దగ్గరికి వెళ్ళడమే కాదు, మన ప్రపంచంలో యేసులా జీవితాన్ని గడుపుతున్నప్పుడు మనం ఆయన దగ్గర ఉండగలం (హెబ్రీయులు 13 చూడండి). ప్రియమైన మిత్రులారా అది అత్యుత్తమమైన గౌరవప్రదమైన ఆరాధన!
నా ప్రార్థన
నీతిమంతుడు మరియు పవిత్రమైన దేవా , దయచేసి నా పాపం, ధైర్యం లేకపోవడం మరియు అనుభవంలేని విశ్వాసం కోసం నన్ను క్షమించు. మీ పవిత్రత విషయంలో రాజీ పడనందుకు ధన్యవాదాలు, కానీ, బదులుగా, మీ కృపతో నన్ను పరిపూర్ణంగా మరియు శుద్ధి చేయడానికి మీ కుమారుడిని త్యాగం చేయడం వల్ల నేను మీ ముందు రాగలను. నేను ఈ వారం జీవిస్తున్నప్పుడు, మీ ప్రవర్తన ద్వారా మీ పవిత్రత ఉద్ధరించబడి, నా వ్యక్తిత్వములో ప్రతిబింబిస్తుందిగాక . నా ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నేను దీనిని అడుగుతున్నాను. ఆమెన్.