ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ప్రపంచంచేత మలచబడకండి. వావ్, అది పాటించడం కష్టం కదా. ఇది గొప్ప ఆధ్యాత్మిక యుద్ధ ప్రదేశాలలో ఒకటిగా మనం భావించే జ్ఞాపిక . అలసత్వపు ఆలోచన సోమరితనం కంటే ఎక్కువ, ఇది ప్రమాదకరం ఎందుకంటే మనకు నిరంతరం దేవుని సత్యం మరియు పవిత్ర విలువలను వక్రీకరించే సందేశాలు అందించబడతాయి. కానీ ప్రపంచంలా ప్రవర్తించే ప్రపంచంతో మండిపడకుండా, మన మనస్సులను పునరుద్ధరించడం ద్వారా మరియు పౌలు చెప్పినది చేయడం ద్వారా రూపాంతరం చెందుదాం - ప్రతి ఆలోచనను, ప్రతి మాటను క్రీస్తు కోలోబడునట్లుగా చేయండి . దశమ భాగం మన డబ్బులో పది శాతాన్ని ఇవ్వడమని మనం తరచుగా అనుకుంటాము, కానీ అంతకన్నా ముఖ్యమైన దశమ భాగం మన పూర్తిగా అవిభాజ్యమైన ఆలోచనా సమయంలో పది శాతాన్ని దేవుని విషయాలకు ఇవ్వడమే !
నా ప్రార్థన
ఓ ప్రభూ, దయచేసి నా ఆత్మను అహంకారం నుండి, నా హృదయాన్ని నిష్కపటత్వం నుండి, మరియు నా మనస్సు అప్రధానమైన విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టకుండా మరియు మీ విషయాలపై సరిపోయినంతా పెట్టలేకపోవడము నుండి నన్ను కాపాడండి. నా తండ్రి పని గురించి, ముఖ్యంగా నా ఆలోచనలల ప్రపంచంలో తండ్రి పని ఏమిటో నా హృదయంలో నాకు నేర్పండి! యేసు నామంలో, నీ చిత్తాన్ని తెలుసుకుని జీవించిన వ్యక్తికి నా గొప్ప ఉదాహరణ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.