ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
యేసు ప్రభువు రాత్రి భోజనాన్ని ఏర్పాటు చేసినప్పుడు, విశ్వాసులు యేసు మరణం, సమాది , పునరుత్థానం మరియు పునరుత్థాన ప్రదర్శనలలో సువార్త హృదయాన్ని లంగరు వేసి నిలుపుతారని అపొస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్పాడు. (1 కొరింథీయులు 15:1-8). ప్రభు రాత్రి భోజనము , కొన్నిసార్లు పవిత్ర సహవాస భోజనము అని కూడా పిలుస్తారు, ఇది క్రీస్తుతో మన నడకకు చాలా ముఖ్యమైనది. మనము ఎదుగుతూ దీనిలో మనము పాలివారము అవుతున్నప్పుడు ఇది సువార్తను గుర్తుచేసుకొని దానిని ప్రకటించే సమయం (1 కొరింథీయులు 11:26). అయితే, ప్రభు భోజనము అనేది దానిలో పాల్గొనే సమయం కంటే ఎక్కువగా ప్రకటించే సమయం . మనము ఒకరికొకరు మరియు క్రీస్తుతో విందును పంచుకుంటాము. మనం యేసు మరణంలో ఆయనతో ఐక్యమై ఉన్నాము, తద్వారా ప్రపంచంలో ఆయన జీవితాన్ని గడపడానికి మన ఆరాధనను మాదిరిగా విడిచిపెట్టవచ్చు. ఈ భాగస్వామ్యం రక్షకునితో మన నడకను పునరుజ్జీవింపజేస్తుంది మరియు అతని రక్షణ మరణం మరియు పునరుత్థానాన్ని తిరిగి జీవించడంలో మనకు సహాయపడుతుంది, తద్వారా మనం ప్రపంచంలో అతని పనిని కొనసాగించవచ్చు.
నా ప్రార్థన
పరిశుద్ధ దేవా మరియు ప్రేమగల తండ్రి, నాకు ప్రభువు భోజనం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పాపానికి యేసు చెల్లించిన యెనలేని ఖర్చు గురించి ఇది చాలా అందమైన మరియు నమ్మదగిన జ్ఞాపిక. పాపం మరియు మరణం నుండి నన్ను విడిపించడానికి మీరు నాపై చూపిన ప్రేమ మరియు విమోచన క్రయధనం యొక్క అందమైన జ్ఞాపిక ఇది. మీ కుమారుడు మరియు నా రక్షకుడి పవిత్ర త్యాగంలో పాలుపంచుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ విలువైన బహుమతిని నేను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోనివాడిగా ఎన్నడును ఉండను లేదా దుర్వినియోగం చేయను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.