ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఈ సరళమైన మరియు స్పష్టమైన వాక్యభాగము రెండు మార్గాలలో విభజించబడింది : మొదటది , ఆశీర్వాదం అది సామాన్యమైనది అయినప్పటికీ దేవుని పిల్లలను మనము ఆశీర్వదించినప్పుడు మనం దీవించబడతాము. రెండవది, ఇతరులు యేసు నామంలో మనలను ఆశీర్వదించడానికి సాధారణమైన పనులు చేసినప్పటికీ మనం సంతోషించవచ్చు, ఎందుకంటే మనం ఇతరుల దయ మరియు కృపను పొందుతాము మరియు దేవుడు ఆ దయను తన అధిక కృపతో ఆశీర్వదిస్తాడు. దాని వివరణ ఈ విధముగా వ్రాయవచ్చు - ఆశిర్వాదకరంగా ఉండటానికి జీవించండి! మనము ఆలా చేసినప్పుడు, దేవుడు మహిమపొందుతాడు. మనము ఆశీర్వదించబడుతాము. మనము ఇతరులను ఆశీర్వదిస్తాము. అదనంగా, ఇతరులు మనకు దయ చూపినప్పుడు, దేవుడు కూడా వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు తన ఆశీర్వాదాలను మనందరిపై కుమ్మరిస్తాడు. దేవుని అద్భుత ఆర్థిక వ్యవస్థలో, మనం ఒకరినొకరు ఎంతగా ఆశీర్వదిస్తామో, అందరికీ అంత ఎక్కువగా ఆశీర్వాదాలు ఉంటాయి!
నా ప్రార్థన
దయ మరియు ప్రేమగల తండ్రీ, దయచేసి నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ ఆశీర్వాదకరంగా ఉండటానికి ఈ వారం నన్ను ఉపయోగించుకోండి. ప్రియమైన తండ్రీ, కానీ ఈ వారము మీ దయ అవసరం ఉన్నవారి జీవితంలోకి దయచేసి నన్ను నడిపించండి. దయచేసి మీరు వారిని నా మార్గంలోకి తీసుకువచ్చినప్పుడు వారిని చూడటానికి నాకు వివేచన ఇవ్వండి. వారిని చేరుకోవడానికి మరియు ఆశీర్వదించడానికి నాకు ధైర్యం ఇవ్వండి. వారిని నా హృదయంలో ఉంచండి మరియు నేను వారికి దీర్ఘకాలిక ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మీ కీర్తి కోసం ఉపయోగించబడటానికి యేసు నామంలో నేను మీ సహాయం మరియు దయను కోరుతున్నాను. ఆమెన్.