ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మేము కృపతో సేవ చేస్తాము. యేసులో మనకు ఇచ్చిన దేవుని కృప వల్ల మనం రక్షింపబడి పవిత్రులం చేయబడ్డాము. యేసు కృప వల్ల మనం దేవుని ముందు పవిత్రులుగా, నిర్దోషులముగా ప్రకటించబడ్డాము . యేసు కృప వల్ల సంఘము కొరకు పరిచర్యలో ఉపయోగించటానికి మనకు కృపావరము ఇవ్వబడింది. యేసులో దేవుని దయ వల్ల కష్ట సమయాల్లో పట్టుదలతో ఉండటానికి మనకు పరిశుద్ధాత్మ నుండి బలం లభిస్తుంది. కాబట్టి మనం ఏ పరిచర్యను ప్రదర్శించగల సామర్థ్యం కలిగి ఉన్నామో, మనకు ఏ అవకాశాలు ఉన్నాయో మరియు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావటానికి మరియు మన పరిచర్యను నెరవేర్చడంలో మనకు ఏ శక్తి ఉందో అవన్నియు మనకు ఇవ్వబడ్డాయి.ఇది ప్రగల్భాలు కోసము చెప్పే విషయం కాదు. ఆయన మహిమ కొరకు ఉపయోగించమని ఆయనకు మనలను మనం అర్పించుకుందాము.కావునా ప్రభువు యొక్క శక్తి బలహీనతలో పరిపూర్ణంగా మారుతుంది.
నా ప్రార్థన
నా శాశ్వతమైన తండ్రీ నీ నామమును మహిమపరచుము.నన్ను విమోచించిన, నాకు బహుమతి ఇచ్చిన, నన్ను బలపరిచిన, నన్ను నడిపించిన, సేవ చేయడానికి నాకు అధికారం ఇచ్చిన యేసుకు ధన్యవాదాలు. నేను చెప్పే మరియు చేసే పనులన్నిటిలో మీరు మహిమపరచబడతారు. యేసు నామంలో ప్రార్థిస్తున్నా. ఆమెన్.