ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
దేవుని ప్రజలతో మాట్లాడానికి ప్రభువు అతనికి ఇచ్చిన కఠినమైన సందేశంతో యిర్మీయా తరచుగా పోరాడాడు. అతను తరచూ ఏడ్చేవాడు మరియు వారికి చెప్పమన్న దానిని చెప్పడానికి తనకు ఇవ్వబడిన దాని గురించి దేవునికి ఫిర్యాదు చేశాడు. అతను ఫిర్యాదు చేయడం తప్పు అని అతనికి తెలుసు, అతను కోపం మరియు శిక్షతో కాకుండా న్యాయం మరియు దయతో తనను సరిదిద్దమని ప్రభువును వేడుకున్నాడు. ఈ అభ్యర్థన, ఒక మంచి స్నేహితుడు తన స్వంత బలహీనతలను మరియు వైఫల్యాలను గుర్తిస్తూ, ప్రార్థన చేసేటప్పుడు ప్రభువును "నన్ను సున్నితంగా వినండి తండ్రీ,"అని క్రమం తప్పకుండా అతను తరచుగా ప్రార్థిన చేసే విధానాన్ని మరియు ఆ విధమైన అభ్యర్థనను నాకు గుర్తుచేస్తుంది. దిద్దుబాటు మరియు దయ అవసరమయ్యే మన పరివర్తన కష్టతరమైనది మరియు మన వైపు కంటే దేవుని పక్షాన మరింత సహనం కలిగియుండడము అవసరం. కాబట్టి మన పాపాన్ని అంగీకరించి, ఇంకా ఆయన పవిత్రమైన మరియు అద్భుతమైన సన్నిధిలోకి రావడానికి అనుమతించిన ఆయన దయ కోసం మనము దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, అతను న్యాయము మరియు దయగలవాడు, నీతిమంతుడు మరియు దయగలవాడని తెలుసు. కృతజ్ఞతలు చెప్పవలసిన విషయం ఏమిటంటే , ప్రభువు మనకు తగినట్లుగా వ్యవహరించడు, కానీ మనకు అవసరమైనట్లుగా వ్యవహారిస్తాడు (కీర్తన 103:1-22). మనము కూడా, "యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమునుబట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపుము".అని ప్రార్ధించాలి.
నా ప్రార్థన
ప్రియమైన దేవా, నేను పాపం చేస్తున్నాను. నేను పాపం చేసినప్పుడు అది నాకు ఇష్టం లేదు, కానీ నా దీర్ఘకాల బలహీనతలలో కొన్నింటికి నేను ఇప్పటికీ లొంగిపోతున్నాను. ప్రియమైన తండ్రీ, దయచేసి నన్ను సరిదిద్దండి మరియు నన్ను నీతి మార్గములొ ఉంచండి, కానీ దయచేసి మీ కోపంతో నన్ను సరిదిద్దకుండా, మీ క్రమశిక్షణ మరియు దయతో నన్ను మార్చడంలో నన్ను మెల్లగా వినయం చేయండి. ప్రియమైన తండ్రీ, నిన్ను సంతోషపెట్టాలని కోరుకోవడం కంటే, నేను నిన్ను మరింత గౌరవించాలని కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి, సున్నితంగా మరియు స్థిరంగా నా హృదయాన్ని ద్వంద్వత్వం, మోసం మరియు ఆధ్యాత్మిక బలహీనత నుండి తొలగించండి. నన్ను పవిత్రతలో పెంచు. యేసు నామంలో. ఆమెన్