ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పాత నిబంధనలో దేవుడు తన ప్రజలతో ఉపయోగించిన వేగవంతమైన మరియు నాటకీయమైన క్రమశిక్షణ మరియు శిక్షను మనం తరచుగా చూస్తాము మరియు దాని తీవ్రతను చూసి ఆశ్చర్యపోతాము. ఇది నిజం అయితే, దయను తిరస్కరించడం మరియు యేసు యొక్క త్యాగాన్ని అపహాస్యం చేయడం దేవుని శిక్షను తీసుకొని వచ్చే మరింత విలువైన చర్యలు అని పరిశుద్ధాత్మ మనకు గుర్తుచేస్తున్నాడు . దయ అపురూపమైనది. ఇది అద్భుతం. కానీ యేసును మరియు మనకు దేవుని ప్రేమ మరియు రక్షణ తీసుకురావడానికి అతను చేసినదంతటిని తిరస్కరించడం విపత్తును ఎదుర్కొనడం మరియు దయ యొక్క ఏదైనా మూలాన్ని తిరస్కరించడమే . యేసును తిరస్కరించడం కఠినమైన పరిణామాలను కలిగి ఉంటుంది, కాబట్టి దయచేసి, ప్రియమైన మిత్రమా,అలా చేయవద్దు! యేసులో ప్రేమ, దయ, కరుణ , నిరీక్షణ మరియు విడుదల యొక్క దేవుని ప్రతిపాదనను దయచేసి తిరస్కరించవద్దు. అపొస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడినప్పుడు ఇలా అన్నాడు: మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. (అపొస్తలుల కార్యములు 4:12).

నా ప్రార్థన

పరిశుద్ధ మరియు నీతిమంతుడైన తండ్రీ, మీ బాధాకరమైన మరియు ఖరీదైన దయకు ధన్యవాదాలు. దయచేసి ఇతరులకు ఆ కృపను ఇతరుల వద్దకు మోసుకొని పోయేవానిలా మరియు పంచుకునే వ్యక్తిగా ఉండటానికి నాకు అధికారం ఇవ్వండి. యేసు సందేశాన్ని దాని మనోహరంగా పంచుకునే సామర్థ్యాన్నిఇచ్చి దయచేసి నన్ను ఆశీర్వదించండి, తద్వారా ఇతరులు మీ రక్షణను తెలుసుకోగలరు మరియు యేసులో వారికి మీ దయను తిరస్కరించిన తర్వాత మీ న్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు, నేను యేసు పేరిట ప్రార్థిస్తున్నాను మరియు వేడుకుంటున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు