ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మంచి రోజును కలిగియుండుటకైన రహస్యం ఏమిటి? మనము మేల్కొనడము మరియు మనం నిన్నటి దినాన్ని ముగించినట్లే ప్రతిరోజును ప్రారంభిస్తున్నాము అనే విషయము గురించి ఆలోచించడము ఎలావుంటుంది - మనము దేవుని నిరంతర ప్రేమ యొక్క పట్టులో ఉన్నాము. అది మన హృదయాలను ప్రేమతో కదిలించేలా చేయాలి అప్పుడు మన స్వరాలు ఆనందంతో పాడతాయి. ఈ పాట మనలో దేవుని ఆత్మను కదిలించి, మన రోజులన్నిటినీ సంతోషపరిచే గాఢమైన మరియు లోతైన కృతజ్ఞతకు దారి తీస్తుంది. కాబట్టి అలసిపోయి, విసుకుగా , మరో రోజుకు భయపడకుండా "ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము" అను ప్రార్ధనతో మన ప్రతి దీనమును ముగిద్దాము అప్పుడు మనము సంతోషముతో మేలుకొనుదుము. మన దైనందిన జీవితంలో దేవుని దయను గుర్తుచేసుకొని, మన హృదయాలలో దేవుని వాగ్దానాలను గుర్తుచేసుకుంటూ ఈ రోజు ప్రారంభిద్దాం. అప్పుడు, మిగిలిన రోజంతా దేవుని గూర్చి పాడడంలో మనకు ఏమైనా సమస్య వస్తుందని నేను అనుకోను!
నా ప్రార్థన
మహిమాన్వితమైన బోధకుడా మరియు నిత్యుడగు తండ్రి , మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రేమను, ఆనందాన్ని నా హృదయంలోకి పోసినందుకు ధన్యవాదాలు. నా హృదయాన్ని నింపండి మరియు మీ స్థిరమైన మరియు నిరంతరాయమైన ప్రేమతో నా జీవితాన్ని సంతృప్తిపరచండి. నా ప్రేమగల రక్షకుడైన యేసు పేరిట ప్రార్థిస్తున్నాను. ఆమెన్.