ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

శారీరకంగా అందంగా ఉన్న దానిని తీసుకొని పాపంతో అపవిత్రం చేయడం గొప్ప బహుమతిని వృధా చేయడమే . దేవుడు భౌతిక సౌందర్యాన్ని మొదట ఎందుకు అనుగ్రహించాడో తెలియని వ్యక్తితో పంచుకుకోవడము కూడా పాపమే . అందాన్ని కలిగిన వ్యక్తి ఆ అందాన్ని పాపసంబంధమైన దానిలో వృధా చేయడం అతనికి అవమానకరం. మనకు ఎలాంటి బహుమతులు ఇవ్వబడినా, శారీరక సౌందర్యం, క్రీడా ప్రతిభ, చురుకైన తెలివి, మనోహరమైన వ్యక్తిత్వం లేదా మరేదైనా సరే, మనం ఇతరులను ఆశీర్వదించడానికి, ప్రభువును గౌరవించడానికి మరియు ఇతరులను అతని దగ్గరకు నడిపించడానికి దేవుడు మనకు ఈ బహుమతులను అనుగ్రహించాడని గుర్తుంచుకోవాలి!

నా ప్రార్థన

ప్రియమైన దేవా, ఇతరులను ఆశీర్వదించడానికి, మిమ్మల్ని గౌరవించడానికి మరియు వారిని యేసుకు దగ్గరగా తీసుకురావడానికి నా బహుమతులు మరియు సామర్థ్యాలను ఉపయోగించని సమయాల కోసం దయచేసి నన్ను క్షమించండి. నేను నీ మహిమ కొరకు జీవించాలని మరియు నీ కృపతో ఇతరులను ఆశీర్వదించాలని కోరుతున్నప్పుడు దయచేసి నాకు ఒక నూతన ఉద్దేశ్యాన్ని ఇవ్వండి. యేసు నామంలో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు