ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఈ లేఖనం బర్నబా గురించి మాట్లాడుతున్నప్పుడు, బర్నబా ఎంత మంచి వ్యక్తో లూకా మనకు గుర్తు చేస్తున్నాడు! మనం ఎందుకు బర్నబాను అంత మంచి వ్యక్తిగా పరిగణించాలి? అనేక కారణాలు ఉన్నవి. ప్రాథమికంగా, బర్నబా విశ్వాసంతో మరియు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడని మనం గుర్తించాలని లూకా కోరుకుంటున్నాడు. బర్నబా మంచితనం మనకు ఆశ్చర్యమేమి కలిగించదు. పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు, ఆయన అలా ఆత్మ ఫలాన్ని ఉత్పత్తి చేసే పనిలో ఉంటాడు (గలతీయులకు 5:22-23) మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు స్వభావాన్ని మనలో కనబడున్నట్లు చేస్తాడు (2 కొరింథీయులకు 3:18). అంతియొకయలో నివసించిన వారి జీవితాలపై బర్నబా ప్రభావం చాలా ముఖ్యమైనది (అపొస్తలుల కార్యములు 13:1-3). అపొస్తలుడైన పౌలుకు మార్గనిర్దేశం చేయడానికి మరియు శిష్యులను పెంచే మార్గాల్లో ఎలా సేవ చేయాలో చూపించడానికి దేవుడు అతన్ని ఎన్నుకోవడంలో ఆశ్చర్యం లేదు. బర్నబా మంచి మనిషి ఎందుకంటే అతని జీవితం దేవుని ఆత్మ ప్రభావంతో ఉంది!

నా ప్రార్థన

ప్రియమైన పరలోక తండ్రీ, యేసు సువార్తను వ్యాప్తి చేయడంలో మరియు మీ రాజ్యాన్ని వృద్ధి చేయడంలో నా జీవితం ప్రభావవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ కుమారుడైన యేసు స్వభావానికి అనుగుణంగా నన్ను మార్చమని మరియు నేను ఇతరులను యేసు వైపు ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ఆత్మ యొక్క ఫలాన్ని నాలో తీసుకురావాలని అడుగుతున్నాను, నన్ను నేను మీకు సజీవ త్యాగంగా సమర్పిస్తున్నాను. నేను యేసు పేరిట ప్రార్థిస్తున్నాను, ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు