ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మన ఆరాధన ఆదివారం మాత్రమే పరిమితం కాదు! ప్రతిరోజూ యేసుకు తన సేవకులముగా అర్పించుకునేటప్పుడు, మనము కూడా ఆయనకు మన ఆరాధనను అర్పిస్తున్నాము. మనం స్పృహతో చెడును ఎదిరించి మంచిని ఎన్నుకున్న ప్రతిసారీ, మనము దేవునికి ఆహ్లాదకరమైన మరియు ఆమోదయోగ్యమైన ఆరాధనను అందిస్తున్నాము. సంఘము భవనంలో మాత్రమే ఆరాధన పరిమితము కాకుండటము ఉత్తేజకరమైనది కాదా! ప్రతి రోజు మన నిర్ణయాలు మరియు చర్యలు దేవునికి మన ఆరాధనలో కీలకమైనవిగా ఉండటము అశ్చర్యకరమైన విషయం కాదా!
నా ప్రార్థన
పరిశుద్ద యెహోవా, సర్వశక్తిమంతుడైన దేవా, దయచేసి నా ఆలోచనలు, నా మాటలు మరియు నా చర్యలను ఈ రోజు, మరియు తరువాత వచ్చే ప్రతిరోజూ మీకు నా ప్రేమపూర్వక ఆరాధనగా అంగీకరించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.