ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
యేసు నీవలే నావలే శోదించబడ్డాడు! అతను మనవలే బాధపడ్డాడు! బాధలు మరియు మరణాలను ఎదుర్కోవడం అంటే ఏమిటో తెలుసినవారు మనకొరకు పరలోకంలో వుండే విధముగా దేవుడు తన కృపలో సిద్దపరిచాడు . ఈ జ్ఞానం సర్వజ్ఞానం మాత్రమే కాదు. పరలోక యొక్క జ్ఞానం మానవ అనుభవాన్ని కలిగి ఉందని యేసు హామీ ఇచ్చాడు. యేసు బాధలు మరియు మరణాలను తెలుసుకున్నాడని మరియు అతను ఇప్పుడు విమోచన, ఆశీర్వదించడానికి మరియు చివరికి మనకు సహాయం చేయడానికి జీవిస్తున్నందుకు మీరు ఆయనకు కృతజ్ఞులై లేరా? ఆయన శ్రమనొండినందుకు నేను బాధపడుచున్నాను. కానీ నేను శ్రమపడుచున్నపుడు ఆయన నాతో నిలినందుకు నేను పులకించిపోయాను. ఆయన శోదించబడి, నలిగిపోయినందుకు నేను బాధపడుచున్నాను కానీ నేను శోదించబడినప్పుడు నాకు సహాయం చేయడానికి ఆయన వున్నాడని తెలిసి నేను కృతజ్ఞడైయున్నాను.
నా ప్రార్థన
ప్రేమగల మరియు సర్వశక్తిమంతుడైన దేవా , మీరు నన్ను యెరుగుదురని నాకు తెలుసు మరియు నాకు ఏది ఉత్తమమో మీకు తెలుసు. కానీ తండ్రీ, మీ సంరక్షణ మరియు అవగాహనపై నాకు మరింత నమ్మకం ఉంది, ఎందుకంటే యేసు బాధలు మరియు మరణాలతో మేము పడుతున్న కుస్తీ పందెమును పంచుకున్నాడు. తండ్రి యొక్క కుడి చేతిలో నాకొరకైన విజ్ఞాపనము దేవునికి అభ్యర్దించుటకు ఉండినందుకు యేసు నీకు ధన్యవాదాలు. ప్రభువైన యేసు, మీ నామములో తండ్రి నిరంతర దయ కోసం నేను అడుగుతున్నాను. ఆమెన్.