ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఆ పాపాల నుండి వారిని (మనల్ని) రక్షించడానికి ముందు యేసు మొదట వారి కొరకు పాపిగా మారాలి (2 కొరింథీయులు 5:21; 1 యోహాను 4:10). అతని క్షమాపణ పొందకముందే అతని స్వంత ప్రజలు అతన్ని తిరస్కరించారు. యేసు ఇచ్చిన రక్షణ బహుమానం అతనికి చాలా ఖరీదైనది. ఇది రెండు గొప్ప సత్యాలను గుర్తు చేస్తుంది: అదేమనగా దేవుడు మనలను నమ్మశక్యం కాని విధంగా ప్రేమిస్తాడు మరియు రక్షణ ఒక విలువైన బహుమతి . యేసులో మనకు రెండు సత్యాలు తెలుసు మరియు అనుభవిస్తున్నాము!
నా ప్రార్థన
సర్వశక్తిమంతుడైన దేవా మరియు రక్షకుడా, యేసులో నా పాపపు మూల్యమును భరించినందుకు ధన్యవాదాలు. మానవ శరీరాన్ని తీసుకున్నందుకు మరియు దాని కష్టాలను భరించినందుకు మరియు తిరస్కరణను ఎదుర్కొన్నందుకు విలువైన ప్రభువుకు ధన్యవాదాలు, తద్వారా నేను రక్షించబడ్డాను. నా రక్షణ యేసుతో పోల్చితే అన్ని ఇతర పేర్లను వెలసిపోయేలా చేస్తుంది, అయన నామమున నేను సమస్త కృతజ్ఞతలు మరియు స్తుతులు అందిస్తాను. ఆమెన్.